NTV Telugu Site icon

లాక్‌డౌన్‌ పొడిగించిన తమిళనాడు ప్రభుత్వం.. కానీ..

కరోనా మహామ్మరిని కట్టడి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ ను తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. నవంబర్‌ 15వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. నవంబర్‌ 1నుంచి సినిమా థియేటర్లలో 100 శాతం అక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. దీనితో పాటు నవంబర్‌ 1 నుంచి 1-8 తరగతులు రోటేషన్‌ విధానంలో ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే ప్రజా రవాణా కోసం బస్సులకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం కేరళకు వెళ్లే బస్సు సేవలను మాత్రం నిలిపివేసింది. వీటితో పాటు దుకాణ సముదాయాలు రాత్రి 11 గంటల వరకు మూసివేయాలంటూ ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని, త్వరలోనే 100 శాతం టీకాలు వేసిన రాష్ట్రంగా ఆదర్శంగా నిలువాలని ప్రభుత్వం ప్రజలకు కోరింది.