iPhone: ఇటీవలి iOS 18+ సాఫ్ట్‌వేర్ అప్డేట్ తర్వాత ఐఫోన్‌లతో పనితీరు సమస్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం టెక్ దిగ్గజం ఆపిల్‌కి నోటీసులు జారీ చేసినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. సాంకేతిక సమస్యలకు సంబంధించి ససెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) యాపిల్‌ని వివరణ కోరింది. యూజర్స్ ఐఫోన్లను అప్డేట్ చేసిన తర్వాత సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు జాతీయ వినియోదారుల హెల్ప్‌లైన్‌కి అనేక ఫిర్యాదులు అందాయి.
Read Also: Chhattisgarh: 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష..
“iOS 18+ సాఫ్ట్‌వేర్ అప్డేట్ తర్వాత ఐఫోన్‌లలో పనితీరు సమస్యలకు సంబంధించి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదులు అందాయి, ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై ప్రతిస్పందన కోరుతూ CCPA ద్వారా ఆపిల్‌కు నోటీసు జారీ చేసింది” అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి జోషి ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
2024లో కూడా కేంద్ర ప్రభుత్వం యాపిల్ యూజర్లకు ఒక హెచ్చరిక జారీ చేసింది. రెండు సాఫ్ట్‌వేర్ సమస్యలను హైలెట్ చేసింది. ఇవి అనధికార యాక్సెస్, డేటా దొంగతనం, హ్యకర్ల చే ప్రభావితమయ్యేలా సిస్టమ్స్ నియంత్రణ ప్రమాదాన్ని కలిగిస్తుందని చెప్పింది. యాపిల్ ఐఫోన్‌లో, ఇతర పరికరాల్లో వినియోగదారుల సమాచారాన్ని స్పూఫింగ్, లీక్ చేసే అవకాశాలకు దారి తీయొచ్చని హెచ్చరించింది.