Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
- నిషేధం ఉన్న భారత్‌లో ప్రమాదకరం పాకిస్తానీ బ్యూటీ క్రీమ్..
- గోరీ క్రీమ్‌లో పాదరసం, సీసం..
- వాడితే కిడ్నీలు, కాలేయంపై ప్రభావం..
- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో అక్రమ విక్రయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తాన్‌తో వాణిజ్యంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆ దేశానికి చెందిన గోరీ బ్యూటీ క్రీమ్ అక్రమంగా దేశంలో విక్రయిస్తు్న్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ క్రీమ్ మార్కెట్లలో, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటోంది. రూ. 400 నుంచి రూ. 800 ధరకు దీనిని విక్రయిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన క్రీమ్ వాడటంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీనిలో పాదరసం, సీసం వంటి విషపూరిత భారీ లోహాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
గోరీ బ్యూటీ క్రీమ్‌లో పాదరసం స్థాయి 5000 పీపీఎంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అయితే, పాదరసం 1 పీపీఎం కన్నా తక్కువగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన రసాయనాలు కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రీమ్ లోని పాదరసం, సీసం చర్మంలోని మెలనిన్(చర్మం నలుపు రంగు కలిగించే కారకం) ఉత్పత్తికి ఆటంకం కలిగించడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది. ఈ క్రీమ్ ఆపేసిన తర్వాత మళ్లీ పూర్వం ఉన్న చర్మం రంగు తిరిగి వస్తుంది. చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన భారీ లోహాలు రక్తప్రవాహంలో కలసి మెదడు, నాడీ వ్యవస్థకు చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి న్యూరోటాక్సిన్లుగా పనిచేసి కోలుకోలేని నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శరీరం ఈ విషపదార్థాలను బయటకు పంపించే క్రమంలో అవి మూత్రపిండాలు, కాలేయంలో పేరుకుపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
- Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
- Kangana Ranaut: సంజయ్, ఇందిరా, రాజీవ్ గాంధీ మరణాలు.. సోనియాపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు..
- Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో 18 మంది మహిళలు తీవ్ర మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వీరందరూ గోరీ క్రీమ్ వాడినట్లు తెలిసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీమ్‌ను నిషేధించింది. అయినప్పటికీ, మార్కెట్లో ఈ పాకిస్తానీ క్రీమ్ లభ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పాకిస్తానీ ప్రోడక్ట్ అమరావతి, నాగ్‌పూర్ మార్గాల ద్వారా మధ్యప్రదేశ్‌లోకి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఖాండ్వా, బుర్హాన్పూర్ మీదుగా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చేరుతోంది.
ఇతర దేశాల్లోనూ ఈ గోరీ బ్రాండ్‌పై నిషేధం ఉంది. 2021లో న్యూజిలాండ్ ఔషధ నియంత్రణ సంస్థ మెడ్‌సేఫ్ (Medsafe), పాదరసం, సీసం ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలడంతో గోరీ బ్యూటీ క్రీమ్ విత్ లైకోపీన్‌ను వాడటం ఆపేయాలని వినియోగదారులకు సూచించింది.2025లో ఫిలిప్పీన్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కూడా ఆ సంస్థ ఉత్పత్తులపై ప్రజారోగ్య హెచ్చరిక జారీ చేసింది.
తాజావార్తలు
-
Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
-
Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
-
Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!