NTV Telugu Site icon

వైర‌ల్ః ఆవుల‌కు పానీపూరీ…వ్యాపారం దెబ్బ‌తిన్నా…

క‌రోనా దెబ్బ‌కు చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బ‌తిన్నారు.  సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నారు.  వ్యాపారాలు ప్రారంభించిన క‌రోనా కార‌ణంగా గ‌తంలో మాదిరిగా జ‌నాలు బ‌య‌ట‌కు రావడంలేదు. ఇక ఇదిలా ఉంటే దేశంలో ఎక్కువ మంది ఇష్ట‌ప‌డే చిరుతిండి పానీపూరి.  గ్రామాల నుంచి న‌గ‌రాల వ‌ర‌కు పానీపూరిని తింటుంటారు.  అయితే, క‌రోనా దెబ్బ‌కు ఈ చిన్న వ్యాపార‌స్తులు తీవ్రంగా స‌ష్ట‌పోతున్నారు.  పానీపూరి మ‌నుషుల‌కు మాత్ర‌మే కాదు, జంతువుల‌కు కూడా బాగా న‌చ్చుతుంద‌ట‌.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలోని రెడ్ హిల్ కాన్వెంట్ స్కూల్ ద‌గ్గ‌ర ఓ పానీపూరి బండి ద‌గ్గ‌ర‌కు ఓ ఆవు, దూడ వ‌చ్చాయి.  వెంట‌నే ఆ వ్యాపారి, ఆ ఆవుకు, దూడ‌కు పానీపూరీల‌ను అందించాడు.  అవి మ‌నుషులు తిన్న‌ట్టుగానే ఇష్టంగా వాటిని తిన్నాయి.  వ్యాపారం లేక‌పోవ‌డంతో ఆవుకు ఆహారం అందించి వాటి ఆక‌లి తీర్చ‌డం సంతోషంగా ఉంద‌ని ఆ వ్యాపారి చెబుతున్నాడు.  దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.