Site icon NTV Telugu

లైంగిక ఆరోపణలు.. మంత్రి పదవి ఊడింది..!

రాజకీయాల్లో.. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి… పదువులు కూడా పోగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.. తాజాగా, గోవా మంత్రి మిలింద్‌ నాయక్‌.. తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది… మంత్రి మిలింద్‌ నాయక్.. అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. ఒక మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్‌ పార్టీ గోవా అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ ఆరోపణలు గుప్పించారు.. ఆ మంత్రిని కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు..

Read Also: దొరికిపోయిన గచ్చిబౌలి నకిలీ సీబీఐ దొంగలు..

మంత్రిపై వస్తున్న ఆరోపణలపై పోలీసు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, తనపై ఆరోపణల నేపథ్యంలో.. మిలింద్ నాయక్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. దీనిపై గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. నిస్పక్షపాతంగా విచారణ జరగాలన్న ఉద్దేశంతో మంత్రి నాయక్ రాజీనామా చేశారని సీఎంవో పేర్కొంది.

Exit mobile version