Goa hikes excise duty on Beer: ఇండియాలో మంచి టూరిస్ట్ స్పాట్ ఏంటంటే వెంటనే గుర్తుకు వచ్చే ప్లేస్ గోవా. మద్యంతో పాటు అందమైన బీచులను ఎంజాయ్ చేయాలంటే ఎక్కువ మంది గోవాకు వెళ్తుంటారు. ముఖ్యంగా మద్యం ప్రియులకైతే.. గోవా స్వర్గధామం. భారతదేశంలో అతి తక్కువ ధరకు మధ్యం విక్రయించే రాష్ట్రం ఏంటంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు గోవా. ఇదిలా ఉంటే గోవాలో ఇకపై మద్యం తక్కువ ధరకు రాబోదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం బీర్లపై ఎక్సైజ్ సుంకాన్నీ పెంచించింది.
Read Also: Andaman and Nicobar: ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సామూహిక అత్యాచారం.. చీఫ్ సెక్రటరీపై మహిళ ఆరోపణలు
బీర్లపై ఎక్సైజ్ సుంకాన్ని బల్క్ లీటర్ కు రూ. 10-12 పెంచింది. అయితే హార్డ్ లిక్కర్ పై ఎలాంటి ఎక్సైజ్ సుంకాన్ని విధించలేదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల అక్కడి మద్యం వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంట్రీ లెవర్ బీర్ పై సుంకాన్ని బల్క్ లీటర్ పై రూ. 30 నుంచి 40కి పెంచారు. ప్రీమియం విభాగంలో 5 శాతం కన్నా ఆల్కాహాల్ ఎక్కువగా ఉన్న స్ట్రాంగ్ బీర్లు, రిటైల్ ధర రూ.160 దాటితే బల్క్ లీటర్ పై రూ. 60 సుంకాన్ని విధించనున్నారు. గతంలో ఇది రూ.50గా ఉండేది.
ప్రమోద్ సావంత్ సర్కార్ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విదేశీ మద్యం విక్రయాలు 30-40 శాతం తగ్గాయి. ప్రభుత్వ నిర్ణయం గోవా పర్యాటకంపై పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. గోవా నుంచి మహారాష్ట్రలోకి మద్యం రావడాన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలకు తీసుకుంటున్న సమయంలో గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గోవా నుంచి మహారాష్ట్రలోకి మద్యం తీసుకువచ్చే వారిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ప్రయోగిస్తామని మహా ప్రభుత్వం హెచ్చరించింది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో మద్యం ధరలు చాలా తక్కువ. ఇక్కడి నుంచి సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తుంటారు. చాలా మంది పర్యాటకులు కూడా మద్యం ధరలు తక్కవ కావడంతో గోవా నుంచి మద్యం బాటిళ్లను తీసుకెళ్తుంటారు.
