World Leaders: భారతదేశం ప్రాచీన కాలంలో అనేక విద్యలకు నిలయంగా ఉండేది. మన రాజులు తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల వంటి అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. దురాక్రమణదారుల దాడుల్లో చాలా వరకు ఇవి నాశనం అయ్యాయి. ఆ సమయంలో ప్రపంచంలోని పలుదేశాల నుంచి వచ్చి ఇక్కడి విద్యను అభ్యసించేవారు. ఇదంతా పక్కన పెడితే, ఆధునిక యుగంలో కూడా పలువురు భారతదేశంలో విద్యను అభ్యసింది, ఆ తర్వాత తమ సొంత దేశాలకు అధినేతలుగా ఎదిగారు.
1) ఆంగ్ సాన్-సూకీ -మయన్మార్
మయన్మార్ దేశాధినేతగా పనిచేసిన నోబెల్ శాంతి అవార్డు గ్రహీత అయిన ఆంగ్ సాన్ సూకీ ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ పొందారు. ఆమెకు 1991లో నోబెల్ బహుమతి వచ్చింది.
2) హమీద్ కర్జాయ్ – ఆఫ్ఘనిస్తాన్
హమీర్ కర్జాయ్ 2004-2014 వరకు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇతని సమయంలో భారత్-ఆఫ్ఘన్ సంబంధాలు చాలా బలోపేతం అయ్యాయి. ఈయన 1983లో హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
3) బింగు వా ముతారికా – మలావి
ఆగ్నేయాఫ్రికా దేశమైన మలావికీ బింగు వా ముతారికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ పొందారు.
4) ఒలుసెగన్ ఒబాసాంజో- నైజీరియా
ఒలుసెగన్ మాథ్యూ ఒకికియోలా అరెము ఒబాసాంజో 1999 నుండి 2007 వరకు నైజీరియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన భారత్‌లో తన సైనిక శిక్షణ పొందారు. కిర్కీలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీలో ఇంజనీరింగ్ లో, ఆ తర్వాత డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ-వెల్లింగ్టన్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆయన ఫిబ్రవరి 13, 1976 నుండి అక్టోబర్ 1, 1979 వరకు నైజీరియాకు సైనిక పాలకుడిగా పనిచేశారు.
5) బాబూరామ్ భట్టారాయ్ – నేపాల్
ఆగస్టు 2011 నుంచి మార్చి 2013 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆయన 1986లో న్యూఢిల్లీలోని జేఎన్‌యూ నుంచి అర్బన్ ప్లానింగ్ లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
6) కబూస్ బిన్ సయీద్ అల్ సయీద్- ఒమన్
దివంతగ ఒమన్ రాజు కబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ ఒకప్పుడు పూణేలో చదవుకున్నాడు. ఇతడికి భారత రాష్ట్రపతిగా పనిచేసిన శంకర్ దయాల్ శర్మ బోధించారు.
