NTV Telugu Site icon

Matrimony: పెళ్లి చేసుకుంటానంది.. రూ. కోటి కాజేసింది

Matrimony

Matrimony

Matrimony: దేశంలో రోజు రోజుకి మ్యా్ట్రిమోనీయల్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమోనీయల్‌ సైట్స్ లో ఉన్న వారితో పరిచయాలు చేసుకోవడం.. వారితో స్నేహంగా నటించడం.. తరువాత వారి నుంచి డబ్బు వసూలు చేయడం. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిలో యువ వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లు ఎక్కువగా మోసపోతున్నారు. మ్యాట్రిమోనియల్‌ సైట్స్ లో పరిచయమైన ఒక అమ్మాయితో ఎన్‌ఆర్‌ఐ టెక్కీ స్నేహం చేశాడు. పరిచయమైన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. నిజమేనని టెక్కీ నమ్మాడు. ఇంకేముంది తనకు కొంత అమౌంట్‌ కావాలని కొద్ది రోజుల తరువాత అడిగింది. అడిగింది తక్కువ అమౌంటేనని పంపాడు. తరువాత పరిచయం పెరిగి నిత్యం ఫోన్‌లో మాట్లాడుకోసాగారు. ఒకరోజు అతడికి నగ్నంగా వీడియో కాల్‌ చేసింది. వీడియోకాల్‌ రికార్డు చేసిన యువతి.. అతన్ని బ్లాక్‌మెయిల్‌ చేసి రూ. కోటి లాగేసింది..

Read also: Manchu Vishnu: మా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం.. అది చేయలేకనేనా.. ?

బెంగళూరులోని ఆర్‌కే పురానికి చెందిన ఓ వ్యక్తి యూకే (UK)లో సాఫ్ట్‌వేర్‌ కొలువు చేస్తున్నాడు. ట్రైనింగ్‌ కోసమని బెంగళూరుకు వచ్చాడు. ఈ సమయంలోనే మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మ్యాట్రీమోనీలో రిజిస్టర్‌ అయ్యాడు. సైట్‌లో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. నిత్యం ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. తన తండ్రి చనిపోయాడంటూ.. ప్రస్తుతం తల్లితోనే ఉంటున్నానని చెప్పడంతో అతను నిజమేనని విశ్వసించాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లేందుకు రూ. 1500లను అప్పుగా ఇవ్వమంటూ ఒక రోజు అతడికి ఫోన్‌ చేసింది. ఆమె మాటలు నమ్మి డబ్బు పంపించాడు. రెండు రోజుల తర్వాత నగ్నంగా అతడికి వీడియో కాల్‌ చేసి మాట్లాడింది. ఈ క్రమంలోనే అతడికి తెలియకుండా అదంతా రికార్డు చేసింది. అనంతరం ఆ క్లిపింగ్‌ను అతడికి షేర్‌ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు పంపిస్తానంటూ.. బెదిరించడం ప్రారంభించింది. అలా రూ. కోటికి పైగా కాజేసింది. యువతి వేధింపులు తాళలేక బాధితుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బ్యాంక్‌ ఖాతాలను గుర్తించి స్తంభింపజేశారు. ఆ విధంగా రూ. 84 లక్షలను ఆమె వినియోగించడానికి వీలు లేకుండా చేశారు. ‘‘ఇప్పటి వరకు ఆమె రూ. 30 లక్షలు వినియోగించింది. అతడి ఫిర్యాదుతో ఆమె ఖాతాను స్తంభింపజేశాం. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపకూడదు. మీకు వచ్చే ఫేక్‌ కాల్స్‌ను నమ్మకండి’’ అంటూ డీసీపీ హెచ్చరించారు.

Show comments