NTV Telugu Site icon

Jeet Adani: గుజరాతీ సంప్రదాయంలో.. నిరాడంబరంగా జీత్ అదానీ వివాహం..

Jeet

Jeet

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం శుక్రవారం అహ్మదాబాద్ లో జరిగింది. గుజరాతీ సంప్రదాయంలో నిరాడంబరంగా జరిగింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కూతురు దివా జైమిన్ షాను వివాహమాడారు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ మ్యారేజ్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. కుమారుడి వివాహ వేళ గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ భావోద్వేగానికి లోనయ్యారు.

Also Read:Thandel : బన్నీ మాటలను మరోసారి నిజం చేసిన దేవిశ్రీప్రసాద్..

కుమారుడి పెళ్లి సందర్భంగా పేదలకు ఉపయోగపడేలా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం కోసం గౌతమ్ అదానీ రూ. 10,000 కోట్లను కూడా విరాళంగా ఇచ్చారు. కాగా జీత్ అదానీ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం – స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన అదానీ విమానాశ్రయాల వ్యాపారం, అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు.