Site icon NTV Telugu

Jaipur: జైపూర్-అజ్మీర్ హైవేపై ఘోర ప్రమాదం.. భారీ శబ్దాలతో పేలిన గ్యాస్ సిలిండర్లు

Gas

Gas

రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రక్కును ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. భారీ శబ్దాలతో పేలిపోవడంతో సమీప గ్రామ ప్రజలు, వాహనదారులు హడలెత్తిపోయారు.

ఇది కూడా చదవండి: Kalyani Priyadarshan : బాబోయ్.. కల్యాణి ప్రియదర్శిన్ ఫోజులు చూస్తే అంతే

హైవేపై సిలిండర్లు పేలిపోవడంతో ఆగి వున్న వాహనాలపై కూడా ప్రభావం చూపించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కిలోమీటర్ల మేర భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సహా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని జైపూర్ ఐజీ రాహుల్ ప్రకాష్ తెలిపారు.ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా సంఘటనాస్థలిని పరిశీలించారు. పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.

ఇది కూడా చదవండి: Brian Lara: అతనో గొప్ప ఆటగాడు.. త్వరలో టెస్టుల్లో చూడాలనుకుంటున్న.. విండీస్ దిగ్గజ ప్లేయర్ హాట్ కామెంట్స్

పోలీసుల సమాచారం మేరకు.. మంగళవారం రాత్రి ఒక హోటల్ పక్కన ట్రక్కు ఆగి ఉంది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అనంతరం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ పేలడం ప్రారంభించాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భారీ శబ్దాలతో వాతావరణం రణరంగంగా మారింది. రాత్రి సమయం కావడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని హైవేపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

 

Exit mobile version