Site icon NTV Telugu

Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?

Gas Cylinders

Gas Cylinders

Gas Cylinder Code: మనలో చాలామందికి ప్రతిరోజు చూస్తూన్న, చేస్తున్న పనులకు సంబంధించి అనేక విషయాలపై ఎలాంటి అవగాహనలేకుండా పనులు చేస్తూ ఉంటాము. ఇలాంటి విషయాల్లో ఒకటిగా చెప్పుకొనే విషయమేమిటంటే.. ప్రతిఒక్కరి ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ పైన ఉండే మూడు అక్షరాల కోడ్ కి అర్థం ఏంటని? నిజానికి ప్రతి గ్యాస్ సిలిండర్ పైన కూడా ఒక కోడ్ ఉంటుంది. దానికి అర్థం ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇళ్లల్లో వాడే గ్యాస్ సిలిండర్స్ అన్నీ కూడా ఎంతో ప్రెజర్ ని తట్టుకునేలా చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తారు. అయితే, రోజులు గడిచే కొద్దీ బయట ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా గాని లేదా సిలిండర్ ని వాడే విధానం బట్టి గాని సిలిండర్ తుప్పు పట్టడం లేదా పగుళ్లు రావడం.. లేదా పాడవడం జరుగుతుంది. అలా పాడైన సిలిండర్లను ఉపయోగిస్తే గ్యాస్ లీక్ అవ్వడం కానీ.. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం గాని జరుగుతుంది. కాబట్టి, సిలిండర్ ని కొన్ని సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా టెస్ట్ చేయాలని ఒక రూల్ ఉంది.

GST Reforms: కామన్ మ్యానికి భలే రిలీఫ్.. లగ్జరీలకు ఓ రేంజ్‌లో షాక్..!

సాధారణంగా ఒక సిలిండర్ కి లైఫ్ 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ 15 సంవత్సరాలలో దానిని రెండు సార్లు టెస్ట్ చేస్తారు. అయితే ఏ టైంకి ఆ సిలిండర్ ని టెస్ట్ చేయాలని తెలిపేదే ఆ కోడ్. మనం చూసే ఈ కోడ్ లో ఏ, బి, సి, డి వీటిలో ఏదో ఒక లెటర్ ఉంటుంది. దాని పక్కన రెండు అంకెల నెంబర్ ఉంటుంది. దీనిలో ఏ, బి, సి, డి అనే లెటర్స్ నెలలను సూచిస్తాయి. ఏ(A) లెటర్ జనవరి నుండి మార్చ్ క్వార్టర్ ని సూచిస్తుంది. అదే బి (B) లెటర్ ఏప్రిల్ నుండి జూన్, సి (C) లెటర్ జూలై నుండి సెప్టెంబర్ వరకు, డి (D) లెటర్ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఇలా ప్రతి అక్షరం మూడు నెలలను ఇండికేట్ చేస్తాయి.

ఇక పక్కన ఉన్న రెండు అంకెల నెంబర్ అనేది సంవత్సరాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక సిలిండర్ మీద A 23 అని ఉంది అనుకుందాం. A అనే లెటర్ జనవరి నుండి మార్చ్ నెలలను ఇండికేట్ చేస్తుంది. చివర్లో ఉన్న 23 అనేది 2023 సంవత్సరం అని. అంటే ఆ సిలిండర్ ని 2023 లో జనవరి నుండి మార్చ్ లోపు టెస్టింగ్ కోసం పంపాలి. ఒకవేళ B 25 అని ఉంటే 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నుండి జూన్ నెలల్లో ఆ సిలిండర్ ని టెస్టింగ్ కి పంపాలి.

RAPO22 : ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే

అలా టెస్టింగ్ కి పంపినప్పుడు అక్కడ వాటర్ ద్వారా హైడ్రో టెస్ట్ చేసి ఎక్కడైనా లీక్ ఉందేమో చెక్ చేస్తారు. అలాగే న్యూమాటిక్ అనే మరొక టెస్ట్ చేసి సిలిండర్ లో ఉండే ప్రెజర్ కన్నా ఐదు రెట్లు ఎక్కువ ప్రెజర్ ని అప్లై చేసి టెస్ట్ చేస్తారు. ఈ టెస్టులలో ఆ సిలిండర్ కి లీక్ ఉన్నట్టు గాని, డామేజ్ అయినట్టు గాని తెలిస్తే దానిని స్క్రాప్ కి పంపిస్తారు. అలా కాకుండా సిలిండర్ ఏమి పాడవకుండా అంతా బాగానే ఉంటే దానికి పెయింట్ వేసి మరోసారి మళ్ళీ దాన్ని ఎప్పుడు టెస్ట్ చేయాలి అనేది కోడ్ రూపంలో ప్రింట్ చేస్తారు.

కాబట్టి, మనం గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో ఒకసారి ఈ కోడ్ ని చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది. ఒకవేళ అలా టెస్ట్ చేయని లేదా డేట్ దాటిపోయిన సిలిండర్ వస్తే.. వెంటనే గ్యాస్ డెలివరీ బాయ్ కి చెప్పి ఆ సిలిండర్ ఇచ్చేసి వేరొకటి తీసుకోవాలి. నిజానికి టెస్ట్ చేయని సిలిండర్లు రావు. కంపెనీ వాళ్లే చెక్ చేసి పంపిస్తారు. ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంటాయి.

Exit mobile version