ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.. ఓ స్థాయిలో రోజువారి కేసులు మూడు లక్షలను కూడా దాటాయి.. దీంతో.. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలియి.. ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి.. రోజువారి కేసులు లక్షకు చేరువచ్చాయి.. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎత్తివేసింది.. ఇవాళ్టి నుంచి ఉద్యోగులందరూ యథావిధిగా ఆఫీసులకు రావాల్సిందేనని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు..
Read Also: ఆంక్షల సడలింపు.. నేడు విద్యాసంస్థల పునః ప్రారంభం
కాగా, జనవరిలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో… 50 శాతం సిబ్బంది మాత్రమే ఆఫీసులకు రావాలని ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని పేర్కొంది.. కానీ, దేశవ్యాప్తంగా క్రమంగా కోవిడ్ కేసులు తగ్గడం, పాజిటివిటీ రేటు కూడా తగ్గిపోతున్న తరుణంలో.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచే.. అంటే ఇవాళ్టి నుంచే ప్రభుత్వ కార్యాలయాలను పూర్తి స్థాయిలో పని చేయించాలని కేంద్రం నిర్ణయించింది.. అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. ఉద్యోగులందరూ విధిగా కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.
