NTV Telugu Site icon

Frog leg in samosa: సమోసాలో “కప్ప కాలు”.. వీడియో వైరల్..

Samosa

Samosa

Frog leg in samosa: వందల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించం లేదు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర తినుబండారాల షాపులు కాసులు వేటలో పడి నాణ్యతను మరిచిపోయి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాయి. చాలా చోట్ల ఆహార పదార్థాల తయారీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో ఆహారంలో బొద్దింకలు, ఎలుకలు వంటివి వస్తున్నాయి. ఇటీవల ముంబైలో ఓ షాపులో కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో తెగిన మనిషి వేలు కనిపించింది.

Read Also: Waqf Board: షాకింగ్ న్యూస్.. ఔరంగజేబు సమాధి, ఆగ్రాలోని జామా మసీదు కూడా వక్ఫ్ ఆస్తి!

ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని బికనీర్ స్వీట్స్ అండ్ సమోసాల దుకాణం నుంచి కొనుగోలు చేసిన సమోసాలో కప్ప కాలు కనుగొనబడింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. దుకాణదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమచారం.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. “ఘజియాబాద్‌లోని బికనీర్ స్వీట్స్‌కు చెందిన సమోసాలో కప్ప కాళ్లు కనిపించిన ఘటన చాలా ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత కోసం ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.