Site icon NTV Telugu

మళ్లీ బర్డ్‌ ఫ్లూ కలకలం..

కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో.. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టినా.. కేరళలో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి.. ఇదే సమయంలో అక్కడ బర్డ్‌ఫ్లూ కేసులు కూడా బయటపడి ఆందోళనకు గురిచేశాయి.. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి.. అయితే, తాజాగా మళ్లీ బర్డ్‌ ఫ్లూ కేసులు కేరళలో వెలుగు చూశాయి. అలప్పుజా జిల్లాలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పంపిన కొన్ని నమూనాలను బర్డ్ ఫ్లూగా నిర్ధారించడం జరిగింది.. కేరళలో గత వారం కొన్ని బాతులు, కోళ్లు, పక్షులు మృత్యువాత పడ్డాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.. ఇక, పరీక్షలు నిర్వహించిన తర్వాత బర్డ్‌ ఫ్లూగా తేల్చేశారు.. ఇక, బర్డ్‌ ఫ్లూ మరింత విస్తరించకుండా చర్యలకు పూనుకున్నారు అధికారులు.

Exit mobile version