Site icon NTV Telugu

ఎన్నికల ఎఫెక్ట్… విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఓ నూతన పథకాన్ని ప్రకటించింది.

Read Also: ఒమిక్రాన్‌కు ఉచిత ప‌రీక్ష‌… లింక్ క్లిక్‌ చేస్తే

రాష్ట్రంలో 10వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా ఉచితంగా ట్యాబ్స్ అందిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఈ పథకం ప్రారంభం సందర్భంగా 100 మంది బాలికలకు ఉచితంగా ట్యాబ్స్ అందజేశారు. మిగతా లబ్ధిదారులకు ట్యాబ్స్ కొనుగోలు కోసం బ్యాంకు అకౌంట్లలో రూ.12వేలు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద 2.65 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లు వారు వెల్లడించారు. ఇప్పటికే 1.59 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.12వేలు నగదు జమ చేశామన్నారు.

Exit mobile version