Free Stay in Dubai : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విమాన సర్వీసులు రద్దు కావడమో లేదా దారి మళ్లించడమో జరుగుతోంది. ఈ క్రమంలో వేలాది మంది పర్యాటకులు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో , నగరంలో చిక్కుకుపోయారు. పర్యాటకులు ఎదుర్కొంటున్న ఈ కష్టాలను గమనించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ , దుబాయ్‌లోని కొన్ని అగ్రశ్రేణి హోటళ్లు వారికి అండగా నిలిచాయి.
10th Halltickets : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే సోనూ సూద్, ఈసారి దుబాయ్‌లో చిక్కుకున్న వారి కోసం రంగంలోకి దిగారు. ‘దుగాస్టా ప్రాపర్టీస్’ (Dugasta Properties) సహకారంతో ఆయన ఈ సాయాన్ని అందిస్తున్నారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బంది పడుతున్న పర్యాటకులు తమ ప్రయాణం తిరిగి ప్రారంభమయ్యే వరకు ఉచితంగా బస చేసేందుకు వసతి కల్పిస్తున్నారు. కేవలం వసతి మాత్రమే కాకుండా, వారికి అవసరమైన ఆహార సదుపాయాలను కూడా కల్పిస్తామని సోనూ సూద్ ప్రకటించారు.
దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన ‘పలాజో వెర్సాచే’ (Palazzo Versace Dubai) కూడా చిక్కుకుపోయిన పర్యాటకుల కోసం తమ తలుపులు తెరిచింది. యుద్ధ పరిస్థితుల వల్ల గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ లగ్జరీ హోటల్ ఉచితంగా బస కల్పిస్తోంది. ఒక ప్రముఖ అంతర్జాతీయ హోటల్ బ్రాండ్ ఇలాంటి క్లిష్ట సమయంలో పర్యాటకుల కోసం ఉచిత వసతిని ప్రకటించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
విమానాల రద్దు కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారింది. పర్యాటకులు హోటల్ రిజర్వేషన్లు దొరకక, అధిక ధరలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ప్రకటనలు పెద్ద ఊరటనిస్తున్నాయి. ఈ సాయం పొందాలనుకునే పర్యాటకుల కోసం సోనూ సూద్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా వివరాలను పంచుకున్నారు. ప్రయాణికులు తమ టిక్కెట్ వివరాలను చూపిస్తే ఈ సౌకర్యాలను పొందవచ్చని సమాచారం.
