Site icon NTV Telugu

Gujarat: గుజరాత్‌లో కూలిన నాలుగు అంతస్తుల భవనం.. శిథిలాలు తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది

Fu

Fu

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సూరత్‌లోని సచిన్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ భవనం ఏళ్ల క్రితం నిర్మించబడినట్లుగా అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: UK: యూకే ఎన్నికల్లో మహిళల సరికొత్త రికార్డ్

ఇటీవల కాలంలో గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాత భవనాలు నీళ్లలో నానిపోతున్నాయి. ఈ కారణంగానే పాత భవనం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఎంత నష్టం జరిగింది.. ప్రాణ నష్టం ఏమైనా ఉందా? అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందాల్సిన అవసరం ఉంది.

Exit mobile version