Site icon NTV Telugu

దేశ రాజధానిలో కలవర పెడుతోన్న ఒమిక్రాన్..! కొత్త ఆంక్షలు..

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. ఇప్పుడు భారత్‌ దేశంలోని పలు రాష్ట్రాలకు వ్యాపించింది.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని ఒమిక్రాన్ టెన్షన్‌ పెడుతోంది.. తాజాగా మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 10కి పెరిగింది.. ప్రస్తుతం తొమ్మిది మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో వ్యక్తి ఒమిక్రాన్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు అధికారులు ప్రకటించారు.. మరోవైపు.. కొత్త వేరియంట్‌ కలకలం సృష్టించడంతో.. అప్రమత్తమైన ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ… ఢిల్లీ పరిధిలో నిషేదాజ్ఞలు విధించింది.. జనవరి 1వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఒమిక్రాన్‌ కట్టడి చర్యల్లో భాగంగా.. బార్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటితో నడుపుకోవాలని స్పష్టం చేసింది.. బాంక్వెట్‌ హాల్స్‌కు కూడా ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.

Exit mobile version