NTV Telugu Site icon

Jharkhand: జార్ఖండ్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనం

Jharkhandfire

Jharkhandfire

జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. చైబాసాలోని జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పువాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలు సజీవ దహనం అయ్యారు. మృతులంతా దాదాపు ఐదు సంవత్సరాల వయసు గలవారు. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలు గడ్డి కుప్ప దగ్గర ఆడుకుంటున్నారని ఎస్పీ చైబాసా తెలిపారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: అమరావతికి వచ్చేందుకు ‘బిట్స్‌’ సిద్ధంగా ఉంది!

ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నలుగురు చిన్నారుల మృతదేహాలను కనుగొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. చిన్నారుల మరణంతో పువాల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని.. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు చెప్పలేమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: DK Aruna: మా ఇంట్లోకి అగంతకుడు ప్రవేశించడంతో.. భయాందోళనకు గురయ్యాం..