NTV Telugu Site icon

కోవిడ్‌తో మాజీ ఎంపీ మృతి

Mohammad Shahabuddin

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖుల ప్రాణాలు తీసింది.. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు.. ఇత‌ర ప్ర‌ముఖులు, సాధార‌ణ ప్ర‌జ‌లో ఎంతో మంది కోవిడ్ బారిన‌ప‌డి ప్రాణాలు విడిచారు.. తాజాగా బీహార్ మాజీ ఎంపీ కోవిడ్‌తో క‌న్నుమూశారు.. ఆర్జేడీ నుంచి సుదీర్ఘ‌కాలం పాటు ఎమ్మెల్యేగా, ఎంపీగా ప‌నిచేసిన మొహమ్మద్ షహబుద్దీన్ గ‌త కొన్నిరోజుల క్రింత కోవిడ్ బారిన‌ప‌డ్డారు.. ఆయ‌న వ‌య‌స్సు 53 ఏళ్లు కాగా.. హ‌త్యానేరం కింద తీహార్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్నారు. జైలులోనే కోవిడ్ సోకింది.. దీంతో.. గ‌త నెల 20వ తేదీన ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆస్ప‌త్రిలో చేర్చారు.. అయితే, అక్క‌డ చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వ‌దిలారు ష‌హ‌బుద్దీన్.. ఆయ‌న మృతికి ఆర్జేడీ నేత‌లు సంతాపం వ్య‌క్తం చేశారు.