NTV Telugu Site icon

Magsaysay award: రామన్ మెగసెసే అవార్డును తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి కేకే శైలజ

Kk Sailaja

Kk Sailaja

Magsaysay award: నోబెల్ తర్వాత అంతటి విశిష్టత కలిగిన అవార్డు రామన్‌ మెగసెసే పురస్కారం. వివిధ రంగాల్లో కృషి వారికి ఈ అవార్డు ఇస్తారు. న్యూయార్క్‌కు చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా అభివర్ణించబడుతుంది. అలాంటి ప్రతిష్టాత్మక రామన్‌ మెగసెసే అవార్డును తిరస్కరించారు సీపీఎం మహిళా నేత. కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఎం సీనియర్ నేత కేకే శైలజకు రామన్ మెగసెసే అవార్డు ప్రకటించగా.. ఆమె తిరస్కరించారు.

రాష్ట్రంలో కొవిడ్, నిఫా వైరస్‌ను నిరోధించడంలో ఆమె చేసిన కృషికి గాను రామన్‌ మెగసెసే అవార్డు కమిటీ ఆమెను సంప్రదించింది. దీనిపై ఆమె అనుమతి కావాలని కోరారు. తాను ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత కాబట్టి ఈ విషయంపై పార్టీతో సంప్రదించి నిర్ణయం చెబుతానని అవార్డు కమిటీకి ఆమె వివరించారు. అనంతరం అవార్డును తిరస్కరిస్తున్నట్లు కమిటీకి తెలిపారు. దీనికి కారణం శైలజ ఈ అవార్డు తీసుకునేందుకు పార్టీ అధిష్ఠానం అంగీకరించపోవడమే. ఈ అంశంపై స్వయంగా కేకే శైలజ ఈ వివరాల్ని వెల్లడించారు. తనకు కమిటీ నుంచి సమాచారం అందిందని, అయితే పార్టీని సంప్రదించిన తర్వాత అవార్డు తీసుకోకూదని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.

Viral Video: హనుమంతుడి వేషధారణలో హుషారుగా డ్యాన్స్‌.. హఠాత్తుగా కుప్పకూలి..

ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ శైలజ మీడియాతో మాట్లాడుతూ.. తాను అవార్డును స్వీకరించకూడదనేది సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమిష్టి నిర్ణయమని చెప్పారు. “మెగసెసే (ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు) కమ్యూనిస్టు వ్యతిరేకి. ఒక వ్యక్తిగా నన్ను అవార్డుకు పరిగణించారు. రాజకీయ నాయకురాలినైన నేను అవార్డును స్వీకరించే విషయమై పార్టీతో సంప్రదింపులు జరిపాను. నా పేరును పరిగణనలోకి తీసుకున్నందుకు నేను ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపాను. నా నిర్ణయాన్ని వారికి తెలియజేశాను” అని తెలిపారు.