Site icon NTV Telugu

Vijay Rupani: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని!

Vijayrupani2

Vijayrupani2

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో నివాసాల మధ్య ఎయిరిండియా విమానం కూలిపోయింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా పలువురు వీఐపీలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం కూలిపోయింది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు సమాచారం. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఆస్తి, ప్రాణ ఎక్కువగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సమాచారం అందుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్‌కు బయల్దేరారు.

 

Exit mobile version