NTV Telugu Site icon

Satyendar jain: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు బెయిల్

Satyendarjain

Satyendarjain

మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. మనీలాండరింగ్ కేసులో 2022, మే నెలలో సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Benjamin Netanyahu: “ఆడు మగాడ్రా బుజ్జి”.. హమాస్, హిజ్బుల్లాకు చుక్కలు చూపిస్తున్న నెతన్యాహూ..

2015 నుంచి 2017 వరకు వివిధ వ్యక్తుల పేర్లతో చరాస్తులు సంపాదించారని సీబీఐ ఫిర్యాదు మేరకు జైన్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. కనీసం నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు జైన్‌పై ఆరోపణలు ఉన్నాయి. జైన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాత్రం.. దర్యాప్తు సంస్థల ఆరోపణలను తోసిపుచ్చారు. ఈడీ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. తగిన ఆధారాలు కూడా లేవన్నారు.

ఇది కూడా చదవండి: Amaravati Drone Summit 2024: డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

Show comments