కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యా్న్ని అందించనున్నారు. అయితే ఈ పథకం ప్రారంభించినప్పుడు ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వృద్ధులు క్షమించాలని కోరారు. రాజకీయ కారణాల చేత ఈ రెండు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని పేర్కొ్న్నారు.
తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఢిల్లీ హెల్త్‌కేర్ మోడల్ గొప్పదని తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం ఆయుష్మాన్ భారత్ పథకంలో అనేక స్కామ్‌లు ఉన్నాయని చెప్పారు. ఇక డిల్లీ ప్రభుత్వం అందిస్తున్న హెల్త్ స్కీమ్‌లో ప్రతి చికిత్స ఉచితమని తెలిపారు. ఆప్ ప్రభుత్వం అందించే స్కీమ్ రూ. 5 లక్షలకే పరిమితం కాదన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో మోడీ తప్పుగా మాట్లాడడం సరికాదుని.. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఆయుష్మాన్ పథకంలో చేరలేదని.. రాజకీయ కారణాల చేత ఆ రెండు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేయనందుకు వృద్ధులు తనను క్షమించాలని మోడీ కోరారు.