Site icon NTV Telugu

Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ.. థాయ్‌లాండ్ గుహ నుంచి పిల్లల్ని రక్షించిన సంస్థకు పిలుపు..

Uttarakhand Tunnel Rescue

Uttarakhand Tunnel Rescue

Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 40 మంది కూలీల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయపనులు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సాంకేతిక కారణాలు, కొండచరియలు విరిగిపడటం సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన కూలీల కోసం భారత వైమానిక దళానికి చెందిన మూడు ప్రత్యేక విమానాలు 25 టన్నుల ప్రత్యేక యంత్ర సామాగ్రిని సరఫరా చేసింది.

బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఉత్తరకాశీలోని సిల్క్యారా మరియు దండల్‌గావ్‌లను కలపడానికి ఉద్దేశించిన 4.5 కిలోమీటర్ల సొరంగంలో ఒక భాగం ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ సొరంగం చార్ ధామ్ ప్రాజెక్టులో భాగం. దీంట్లోనే కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులంతా సజీవంగానే ఉన్నారు. వీరిని రక్షించడానికి అధికార యంత్రాంగం పనిచేస్తోంది.

Read Also: Babar Azam: పాక్ టీంకు షాక్.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన బాబర్ ఆజమ్..

2018లో థాయ్‌లాండ్ లోని గుహలో చిక్కుకుపోయిన పిల్లలను రక్షించేందుకు సహకరించిన వారిని కూడా థాయ్‌లాండ్, నార్వేల నుంచి రప్పించారు. కూలీలను రక్షించేందుకు వారు కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి తీసుకువస్తున్న ప్రత్యేక యంత్రం గంటలో 4-5 మీటర్ల శిథిలాలను తొలగిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 10-12 గంటల్లో కూలీలు ఉన్న ప్రదేశానికి రెస్క్యూ పైపు వెళ్తుంది. 900 మిమీ వ్యాసం ఉన్న ఈ పైపు రెస్క్యూ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ రోజు సాయంత్రానికి యంత్రం వచ్చే అవకాశం ఉందని, వచ్చిన కొన్ని గంటల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

థాయ్‌లాండ్ గుహ సంఘటన:

2018లో ఉత్తర థాయ్‌లాండ్ లోని చియాంగ్ రాయ్ ప్రావిన్సులోని గుహలో జూనియర్ ఫుట్‌బాల్ టీం చిక్కుకుపోయింది. ఆ తర్వాత క్రమంగా వర్షం పెరగడం, నీరు పెరగడంతో పిల్లలు వెనక్కి తిరిగి రాలేకపోయారు. దీంతో వీరిని రక్షించేందుకు థాయ్‌లాండ్ కు చెందిన ఓ కంపెనీ రెస్కూలో పాల్గొంది. దాదాపుగా దేశవిదేశాలకు చెందిన 10,000 మంది వారం రోజుల పాటు రెస్క్యూ చేసి పిల్లల్ని కాపాడారు. నార్వేకు చెందిన జియోటెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సాయం తీసుకుంటున్నారు. ఇండియన్ రైల్వేస్‌‌లోని నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు.

Exit mobile version