Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై జలప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో.. ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్లు సమాచారం. దాదాపు 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని తెలుస్తుంది. అయితే, 20-25 హోటళ్లు, ఇళ్లు వరకు కొట్టుకుపోయి ఉండొచ్చని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్‌గఢ్ నుంచి పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి నిమిషాల్లోనే చేరుకున్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ ఇండియన్క ఆర్మీని అలర్ట్ చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ బృందాలు ఘటనా ప్రదేశంలో సహాయక చర్యలకు చేపట్టినట్లు సమాచారం.
Read Also: Screenshot History: స్క్రీన్‌షాట్ ఫీచర్‌ను ఎవరు కనుగొన్నారో తెలుసా..? ఆసక్తికర విషయాలు…
అయితే, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకాశీలోని ధరాలీలో వరద సృష్టించిన బీభత్సం అనే వార్త చాలా బాధాకరమన్నారు. పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా సాయం చేస్తామన్నారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆ దేవుడి కోరుకుంటున్నాను అని చెప్పారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం ధామీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి స్థానిక పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
