NTV Telugu Site icon

అక్కడ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి.. దేశంలోనే తొలిసారి

vaccination

vaccination

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైకమార్గం వ్యాక్సినేషన్‌ ఒకటే.. కానీ, వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి.. పట్టణాలు, నగరాలు కూడా వీటికి మినహాయింపు కాదు.. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, వ్యాక్సిన్‌ అంటేనే నాకు వద్దు బాబోయ్ అనేవారు ఉన్నారు.. కానీ, ఓ మారుమూల గ్రామంలో.. వందకు వందశాతం మంది వ్యాక్సిన్‌ తీసుకుని రికార్డు కెక్కారు.. ఈ అరుదైన ఘనత సాధించింది జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా వేయాన్‌ గ్రామం.. అక్కడ 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ వేశారు… బందిపోరా జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్లు దూరంలో ఉండే ఈ గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు.. ఆ గ్రామానికి చేరాలంటే ఏకంగా 18 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి.. అయినా.. ఆరోగ్యసిబ్బంది కృషితో.. వందశాతం వ్యాక్సిన్‌ పూర్తి చేశారు.. దేశంలోనే తొలిసారి వేయాన్ గ్రామం 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఆ గ్రామంలో 18 ఏళ్ల పైబడినవారు మొత్తం 362 మంది ఉన్నారు.. వీరు పశువుల మేత కోసం నిత్యం వేరే ప్రాంతాలకు సంచరిస్తూ ఉంటారు.. మారు మూల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి వ్యాక్సినేషన్‌పై సరైన అవగాహన లేకపోయినా.. వైద్యాధికారులు, సిబ్బంది కృషితో.. ఆ ప్రక్రియ పూర్తిచేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం 18 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాని సంగతి తెలిసిందే..