దేశంలో డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ కు కారణమైంది. ఈ వేరియంట్ కారణంగానే రోజూ లక్షలాది కేసులు నమోదయ్యాయి. వేలాది మరణాలు సంభవించాయి. టీకాను వేగవంతం చేయడంతో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, డెల్టా వేరియంట్ ఉత్పరివర్తనం చేంది డెల్టాప్లస్ వేరియంట్‌గా మారింది. ఈ డెల్టాప్లస్ కేసులు ఇండియాలో క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ డెల్టాప్లస్ వేరియంట్ ప్రమాదకారి అని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది.
Read: 40 ఏళ్ళ ‘ఊరికిచ్చిన మాట’
ఇక ఇదిలా ఉంటే, డెల్టాప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తి చికిత్సపొందుతూ మరణించాడు. ఈ తొలిమరణం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగింది. డెల్టాప్లస్ సొకిన రోగుల్లో ఒకరు మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే, టీకా తీసుకొకపోవడం వలనే ఆ వ్యక్తి మరణించాడని, టీకా తీసుకున్న నలుగురు రోగులు డెల్టాప్లస్‌ను జయించారని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
