Tamilnadu Fire Accident: తమిళనాడులోని కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం పాతపేటలోని ఓ బాణాసంచా గోడౌన్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బాణాసంచా గోడౌన్ కావడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి భారీగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల అదుపులోకి తెచ్చుందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read also: Ruhani Sharma Hot Images: బ్యాక్ లెస్‌గా రుహానీ శర్మ.. ఇట్స్ వెరీ హాట్ గురూ!
పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి విషాదాన్ని మిగిల్చాయి. శనివారం ఉదయాన్నే ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఘటనా ప్రాంతంలో క్షతగాత్రుల హాహాకారాలు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు మొదలయ్యాయి. ఈ పేలుళ్లలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక, వైద్య సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన పేలుడు ప్రభావం ఎక్కువగా ఉండడంతో సమీపంలోని ఓ హోటల్ భవనం కూలిపోగా, మరో నాలుగు భవనాలు పాక్షికంగా దెబ్బతినడంతో పలువురు చిక్కుకుపోయారు. తీవ్రంగా గాయపడిన ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ టెండర్లు, రెస్క్యూ టీమ్‌లు మంటలను ఆర్పివేసి లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పేలుడు ధాటికి హోటల్ భవనం పూర్తిగా కూలిపోయిందని, సమీపంలోని మూడు-నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న మొత్తం వ్యక్తుల సంఖ్యను రెస్క్యూ సిబ్బంది ఇంకా గుర్తించలేదు.