NTV Telugu Site icon

Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..

Ranveer Allahbadia

Ranveer Allahbadia

Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాదియా వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. రాజకీయంగా కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాస్ గాట్ లాటెంట్‌ షోలో చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ల్ సమయ్ రైనా, రణవీర్ అల్లాబాదియా, ఆశిష్ చంచలానీ, అపూర్వ ముఖియాతో పాటు ఇతరులపై మహారాష్ట్ర పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కామెడీ షోలోని అన్ని ఎపిసోడ్లను సైబర్ బ్రాంచ్ సమీక్షించిన తర్వాత కేసు నమోదైంది.

Read Also: Beauty Tips: ముఖంపై మచ్చలు, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి

ఈ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై ఇది రెండో కేసు. అంతకుముందు అస్సాం పోలీసులు యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా, హాస్యనటుడు సమయ్ రైనా, ఇతర ఇన్‌ఫ్లూయెన్సర్లు “అశ్లీలతను ప్రోత్సహించడం, లైంగికంగా అసభ్యకరమైన, అసభ్యకరమైన చర్చలో పాల్గొనడం” అనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర పోలీసులు 30 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కొంతమంది నిందితులకు సమన్లు జారీ చేయగా, మరికొందరిన్ని విచారణకు పిలిపించనున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 67 (ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అశ్లీల విషయాలను ప్రసారం చేయడం), భారతీయ న్యాయ సంహితలోని ఇతర సంబంధిత విభాగాల కింద ఈ కేసు నమోదు చేయబడింది.

‘‘ఇండియాస్ గాట్ లాలెంట్ షో’’లో రణవీర్ అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. షోకి వచ్చిన ఒక మహిళా కంటెస్టెంట్‌తో..‘‘ మీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం జీవితాంతం చూస్తావా..? లేదా ఒక సారి వారితో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా..?’’ అంటూ అడిగాడు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా షోకి హాజరైన వారు షాక్ అయ్యారు. ఈ కామెంట్స్‌పై అందరు మండిపడటంతో అతను క్షమాపణలు చెప్పాడు.