NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్‌గాంధీని టెర్రరిస్టు అన్న కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్

Rahilgandhi

Rahilgandhi

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన తీవ్ర వివాదాలకు దారి తీసింది. అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. భారత్‌లో సిక్కులు భయంతో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు కూడా మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Devara -Pushpa 2: ‘దేవర’ ఆయుధ పూజ.. ‘పుష్ప 2’ జాతర.. పోతారు మొత్తం పోతారు!

కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ ఇటీవల రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నెంబర్ వన్ టెర్రరిస్ట్‌ అంటూ సంభోదించారు. రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల్లో ఒకరు బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‪లో కేంద్రమంత్రిపై ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం కేంద్ర మంత్రిపై కేసు నమోదైంది.

‘‘రాహుల్‌గాంధీ ఇండియన్ కాదు. ఆయన ఎక్కువ సమయం బయటే గడిపారు. ఆయనకు ఈ దేశంపై ఏ మాత్రం ప్రేమ లేదు. అందువల్లే విదేశాలకు వెళ్లినప్పుడల్లా మన దేశాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను మోస్ట్ వాటెండ్ పీపుల్, వేర్పాటువాదులు, బాంబులు-తుపాకులు-బుల్లెట్ల తయారీ నిపుణులు మాత్రమే అభినందిస్తుంటారు. వాళ్లు కూడా రాహుల్ మాట్లాడినట్టే మాట్లాడతారు. అలాంటి వ్యక్తులు రాహుల్‌కు మద్దతు తెలుపుతున్నారంటే దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్టు ఆయనే అవుతారు’’ అని రవ్‌నీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Thota Trimurthulu: జనసేనలోకి ఎమ్మెల్సీ తోట జంప్..!?

అమెరికాలో రాహుల్ మాట్లాడుతూ ‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది.’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీలోని సోనియాగాంధీ ఇంటిముందు సిక్కులు ఆందోళనలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Devara: మెంటలెక్కిస్తున్న ‘దేవర’.. ఒక్కోటి ఒక్కో డైమాండ్ మావా!