Halwa Ceremony: కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు మాత్రమే హాజరవుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు వీరు పార్లమెంట్‌లోని మంత్రిత్వ శాఖ ప్రాంగణంలోనే ఉండనున్నారు.
Read Also: Minister Narayana: వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం!
కాగా, భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ లో తయారు చేస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా హల్వా వడ్డించనున్నారు. ఈ హల్వా వేడుక ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడంతో పాటు బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకనుంది. ఇక, ఈ ఏడాది వేడుకలకు నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి, కార్యదర్శులు, బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. అలాగే, పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జనవరి 31వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
Read Also: Uttam Kumar Reddy: మంత్రి కాన్వాయ్‌కి ప్రమాదం.. భారీగా దెబ్బతిన్న వాహనాలు
ఇక, బడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా నిర్వహించే హల్వా వేడుక 1980 నుంచి కొనసాగుతుంది. మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన ఘటనను అధిగమించి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తన ఏడో పూర్తికాల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశ పెట్టడానికి సిద్ధమైంది. నరేంద్ర మోడీ 3.0 పాలనలో కీలక ప్రకటనలు, ఆర్థిక మార్గ దర్శకాల కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల అంకితభావం, కృషికి నిదర్శనంగా ఈ హల్వా వేడుక నిలుస్తుంది.