Father, Uncle physically Abuse 2 Chhattisgarh Sisters: కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే మృగాళ్లుగా మారారు. తండ్రి, మేనమామ ఇద్దరు అక్కాచెల్లిళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వేధింపులు భరించలేక ఇద్దరూ కూడా ఇళ్లువదిలిపెట్టి పారిపోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆదివారం పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరిని భిలాయ్ నగరంలో అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి ప్రభాత్ కుమార్ వెల్లడించారు.
Read Also: Iran: హిజాబ్ ధరించని మహిళకు బ్యాంక్ సేవలు.. చివరకు మేనేజర్ పని ఖతం..
వివరాల్లోకి వెళితే.. లైంగిక వేధింపులు భరించలేక ఇద్దరు అక్కాచెల్లిళ్లు ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద వీరిద్దరిని పోలీసులు రెస్క్యూ చేశారు. ఈ సమయంలో తమపై తండ్రి, మేనమామ సాగించిన దారుణాలను పోలీసులకు చెప్పారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల వయసున్న బాలిక తరుచుగా తన అత్త ఇంటికి వెళ్లేది. తల్లి మానసిక వ్యాధి కారణంగా అత్త ఇంటి దగ్గర ఎక్కువగా ఉండేది. అయితే బాలికపై కన్నేసిన మేనమామ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగికంగా వేధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017 నుంచి ఈ వేధింపులు ప్రారంభం అయ్యాయి.
ఈ వేధింపుల గురించి తండ్రికి చెప్పింది బాలిక. అయితే అండగా నిలవాల్సిన తండ్రి కూడా ఆమెను తిట్టడంతో పాటు వేధించడం ప్రారంభించాడు. దీంతో సదరు బాలిక, 14 ఏళ్ల చెల్లిని కూడా తండ్రి వేధించడం ప్రారంభించాడు. దీంతో వీరిద్దరు ఇళ్లు వదిలి పారిపోయారు. బాధితుల ఆరోపణల ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్లు 376 (రేప్), 354 (ఒక మహిళపై దాడి చేయడం లేదా క్రిమినల్ బలవంతం చేయడం, ఆమె గౌరవానికి భంగం కలిగించడం), ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.