Father Hold His Daughter Wedding Ceremony In Cemetery In Maharashtra: మన హిందూ సాంప్రదాయాల్లో పెళ్లి అనేది ఒక గొప్ప శుభకార్యం. ఈ శుభకార్యాన్ని దేవాలయాల్లోనో, ఇంటి వద్దనో లేక ఫంక్షన్ హాల్స్‌లోనే ఎంతో ఘనంగా జరుపుకుంటాం. బంధుమిత్రులను పిలిపించి ఒక పండుగలాగా దీనిని నిర్వహించుకుంటాం. కొందరైతే ప్రత్యేక ప్రాంతాల్ని ఎంపిక చేసుకొని, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ చాలా గ్రాండ్‌గా పెళ్లి తంతు చేసుకుంటున్నారు. కానీ.. స్మశానంలో పెళ్లి జరగడాన్ని మీరెప్పుడైనా చేశారా? మహారాష్ట్రలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఓ తండ్రి.. ప్రేమించిన యువకుడితో తన కుమార్తె వివాహాన్ని స్మశానంలో జరిపించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Union Minister Video Call: వీడియో కాల్‌లో పోర్న్.. కేంద్రమంత్రికే బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శిర్డీ సమీపంలో గల రహతా గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తి స్థానిక స్మశానవాటికలో కాటికాపరిగా పనిచేస్తున్నాడు. మహాసంజోగి వర్గానికి చెందిన గంగాధర్.. చాలా సంవత్సరాల నుంచి తన కుటుంబంతో కలిసి ఆ స్మశానంలోనే నివాసం ఉంటున్నాడు. ఇతనికి మయూరి అనే కుమార్తె ఉంది. తండ్రి వద్దే ఉంటూ.. ఈ యువతి 12వ తరగతి వరకు చదువుకుంది. చదువుకునే క్రమంలోనే ఈమెకు శిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా, కొంతకాలంలోనే అది ప్రేమగా మారింది. అయితే.. మయూరి ఇతరుల్లా ఇల్లు వదిలి ప్రియుడితో పారిపోకుండా, కుటుంబం అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో.. తాను మనోజ్‌ని ప్రేమించిన సంగతిని తన తండ్రికి తెలిపింది.
Manipur Violence: మణిపూర్‌లో ఆగని హింస.. మయన్మార్ సరిహద్దులోని మోరేలో 30 ఇళ్లకు నిప్పు
కూతురి ప్రేమ సంగతి తెలిసి కాస్త సంశయంలో పడ్డ గంగాధర్.. ఆ తర్వాత ఆమెకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేసేందుకు అంగీకారం తెలిపాడు. అటు.. మనోజ్ కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే.. తన కూతురు పెరిగిన చోటే పెళ్లి చేయాలన్నది గంగాధర్ సంకల్పం. స్మశానంలోనే పెళ్లి చేస్తానని అతడు ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల ముందు అభ్యర్థన పెట్టాడు. అందుకు వాళ్లు ఓకే అని చెప్పడంతో.. స్మశానంలో మయూరి, మనోజ్‌లో పెళ్లి దిగ్విజయంగా పూర్తయింది.