సకాలంలో వర్షాలు కురవకపోవడం వలన పంటను పండించలేరు. అదే విధంగా భారీ వర్షాలు వరదల కారణంగా కూడా పంటకు నష్టం వస్తుంది. ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంది. ఈ పరిహారం కోసం రైతులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరగాలి. డబ్బులు చెల్లించాలి. వచ్చిన మొత్తంలో కొంత సమర్పిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. అయితే, హర్యానాలో ఓ రైతుకు వింత సమస్య వచ్చిపడింది. తనకు 20 ఎకరాల పంటపోలం ఉన్నది. అయితే, అతనికి రెండు ఎకరాల్లోని పంటకు మాత్రమే సష్టపరిహారం రావాలి. కానీ, 10 ఎకరాల్లోని పంట నష్టం వచ్చిందిన చెప్పి అధికారలు రికార్డుల్లో రాసుకొని రైతు ఎకౌంట్‌లో రూ.70 వేలు జమచేశారు. న్యాయంగా తనకు రావాల్సింది కేవలం రూ.14 వేలు మాత్రమే అని, మిగతా రూ.56 వేలు తనకు అవసరం లేదని చెప్పి రైతు అధికారుల వద్దకు వెళ్లి డబ్బును ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. గత ఆరేళ్లుగా ఆ రైతు ఆధికారుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు వెనక్కి తీసుకోవడం లేదని ఆ రైతు వాపోతున్నాడు.
రైతుకు వింత కష్టం: ఆ డబ్బు వెనక్కి ఇస్తుంటే అధికారులు తీసుకోవడం లేదట…!!
