Living With Dead Body: ఇంట్లో ఏడాదిన్నరగా మృత దేహం..పెన్షన్ దరఖాస్తులో బయటపడ్డ భాగోతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family living with dead body in kanpur: కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏడాదిన్నర క్రింతం ఇంట్లోనే అలానే ఉంచుకున్నారు కుటుంబ సభ్యులు. స్థానిక సమాచారంతో పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లో అడుగు పెట్టగానే భరించలేని దుర్యాసన. ఓ బెడ్ రూం నుంచి ఆవాసన వస్తుందని గమనించిన పోలీసులు అక్కడికి వెల్లి చూడగానే.. ఒక్కసారిగా ఖంగుతున్నారు. బెడ్ మీద మృదదేహం, బెడ్‌కి అతుక్కుపోయి వుండటం చూసి ఆశ్చర్య పోయారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి వారు ఇప్పటికి ఉన్నారా? అనే ప్రశ్నగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ లోని రావత్పూర్ లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్ అనే వ్యక్తి 38 సంవత్సరాలు. అహ్మదాబాద్ లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. కాగా.. ఆయన 2021 ఏప్రిల్ 22న మరణించాడు. ఈనేపథ్యంలో.. విమలేశ్ మృతి చెందినా ఆవిషయాన్ని కుటుంబసభ్యులు బయటపెట్టలేదు. విమలేశ్ కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈనేపథ్యంలో.. విమలేశ్ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తుంది. భర్త చనిపోవడంతో.. పెన్షన్ దరఖాస్తు చేయడానికి విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. దీంతో.. ఆదాయ పన్నుశాఖ, సీఎంవోకు ఈ విషయాన్ని తెలియజేసింది.
Also Read
- PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
- Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
- Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
- Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
అయితే.. సీఎంవో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. ఈ.. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే విమలేశ్ ఇంటికి చేరుకున్నారు. ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ లో.. ఎల్ఎల్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఇక విమలేశ్ మృతదేహం పూర్తిగా చెడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. విమలేశ్ ఎముకల్లో మాంసం కూడా ఎండిపోయిందని తెలిపారు. విమలేశ్ మృతదేహాన్ని ఏడాదిన్నరగా ఎలా ఇంట్లో ఉంచుకుంటారని స్థానికులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా 2021లో అందరూ అల్లడుతూ వుంటే వీల్లు మాత్రం మృతదేహాన్ని ఎలా ఇంట్లో వుంచుకోవడమే కాకుండా.. ఏడాదిన్నరగా చనిపోయిన మనిషితో ఇంట్లో సావాసమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ కుటుంబ సభ్యులను వైద్యులకు చూపించాలని, పోలీసులు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
कानपुर में डेढ़ साल से घर में रखे थे इनकम टैक्स अधिकारी का शव, परिवार मौत स्वीकारने को तैयार ही नहीं। कोरोना काल में हो चुकी थी अधिकारी की मौत pic.twitter.com/8HdoO5SBb2
— AYUSH TIWARI (@AYUSHTI10077811) September 23, 2022
తాజావార్తలు
-
INDA vs NZA: మళ్లీ నిరాశ పరిచిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. దూకుడు పెంచిన పడిక్కల్, సాయి సుదర్శన్..
-
Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!