Site icon NTV Telugu

Nirmala Sitharaman: మమత వ్యాఖ్యల్ని ఖండించిన ఆర్థికమంత్రి

Nirmalasitharaman

Nirmalasitharaman

నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైక్ కట్ చేశారన్న ఆరోపణలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. సమావేశంలో మాట్లాడేందుకు అందరికీ నిర్ణీత సమయాన్ని కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఏదో ఆరోపణ చేయడానికి మమత ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టారు. సమావేశంలో అందరి అభిప్రాయాలను ఆలకించినట్లు తెలిపారు. ఆమె మైక్ కట్ చేశారని చెప్పడం విచారకరమన్నారు.

ఇది కూాడా చదవండి: Godavari: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. 3 రోజుల పాటు కొనసాగనున్న వరద ప్రవాహం

ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ సమావేశం జరిగింది, సీఎం మమత ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయింది. దీంతో ఆమె సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారని ఆరోపించారు. ఎన్డీయేతర ముఖ్యమంత్రుల్లో తానొక్కదాన్నే హాజరైతే.. కనీసం తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ముఖ్యమంత్రులకు మాత్రం 20 నిమిషాల సమయం ఇచ్చారని మమత ఆరోపించారు.

ఇది కూాడా చదవండి: ITR filing: రికార్డ్ స్థాయిలో ఐటీ రిటర్నులు దాఖలు.. ఒక్కరోజులోనే ఎన్ని వచ్చాయంటే..!

Exit mobile version