Fake Student: ఐఐటీ బాంబేలో విద్యార్థిగా నటిస్తూ 14 రోజలు పాటు అక్రమంగా నివసించిన 22 ఏళ్ల వ్యక్తి బిలాల్ అహ్మద్‌ను అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూన్ 26న బిలాల్ సోఫాపై నిద్రిస్తున్నట్లు గమనించిన ఐఐటీ బాంబే ఉద్యోగి, ఎవరు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా పారిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సీసీటీవీ ద్వారా అధికారులు అతడిని గుర్తించారు. ప్రస్తుతం, అతడిని జూలై 07 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. బిలాల్ హాస్టల్ గదుల్లో సోఫాపై పడుకునేవాడు, అనేక సెమినార్లకు హాజరయ్యే వాడని తేలింది. తనను తాను పీహెచ్‌డీ విద్యార్థిగా పరిచయం చేసుకుని, నకిలీ అడ్మిషన్ పత్రాలను ఉపయోగించినట్లు తేలింది. క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై నిర్వహించిన సెమినార్‌కు కూడా హాజరైనట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది.
Read Also: Patancheru Blast: పాశమైలారం ప్రమాదం: గుర్తించిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
విచారణలో, గతేడాది నెల పాటు క్యాంపస్‌లో ఉన్నట్లు, అప్పుడు ఎవరూ గమనించలేదని బిలాల్ వెల్లడించాడు. బిలాల్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో డేటా తొలగించినట్లు కనుగొన్నారు. సైబర్ ల్యాబ్ సాయంతో అధికారులు సమాచారాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బిలాల్ క్యాంపస్ వీడియోలు కూడా తీశాడని, కానీ వాటిని ఎవరికీ పంపలేదని తేలింది. బిలాల్ 21ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే, వీటిని తాను అనేక బ్లాగుల కోసం క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఎక్కువ డబ్బు సంపాదించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలని అనుకున్నట్లు పోలీస్ విచారణలో బిలాల్ చెప్పాడు.
గుజరాత్ సూరత్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే బిలాల్, అక్కడ నెలకు రూ. 1.25లక్షలు సంపాదిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐటీపై ఇష్టం ఉన్న ఇతను, ఇంటర్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. వెబ్ డిజైన్‌లో డిప్లొమా చేసినట్లు తెలుస్తోంది. బిలాల్ తండ్రి వస్త్ర వ్యాపారంలో ఉన్నారు. 2024కు ముందు బిలాల్ బహ్రెయిన్, దీనికి ముందు దుబాయ్ వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. ఐబీ, ఉగ్రవాద నిరోధక సంస్థలు బిలాల్‌ను ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసులో దేశవ్యతిరేక కోణం ఉందా..? అని అధికారులు పరిశీలిస్తున్నారు.
