Marathi Row: రాజ్‌ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీ కార్యకర్తలు ‘‘మరాఠీ’’ మాట్లాడటం లేదని చెబుతూ ఓ దుకాణదారుడిపై దాడి చేయడంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించాడనే కారణంగా దాడి చేసినట్లు ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Africa: ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. బాధితుల్లో ఇద్దరు ఏపీ వాసులే..!
దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ ‘‘ నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మరాఠీలో గర్వపడటం మరియు ప్రజలపై దాడి చేయడం వేరు. ఎవరైనా ఇతర భాషలు మాట్లాడే వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పోలీసులు చర్య తీసుకుంటారు. ఈ సంఘటనలో ఇప్పటికే చర్యలు తీసుకున్నారు’’ అని రాజ్‌ఠాక్రే పార్టీతో పాటు మరాఠీపై వివాదం సృష్టించే వారికి వార్నింగ్ ఇచ్చారు. దాడులు చేస్తున్నవారి గురించి మాట్లాడుతూ.. వారు ఇంగ్లీష్‌ని పొగుడుతారు, హిందీని వ్యతిరేకిస్తారని సీఎం అన్నారు.
ముంబై సమీపంలోని మీరా రోడ్‌లో ‘జోధ్‌పూర్ స్వీర్ షాప్’ నడుపుతున్న 48 ఏళ్ల దుకాణదారుడు బాబులాల్ చౌదరిపై ఎంఎన్ఎస్ సభ్యులు దాడి చేశారు. శుక్రవారం, ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మరాఠీ పేరుతో ఎవరైనా గుండాయిజం చేస్తే సహించేంది లేదని హెచ్చరించారు. మీరా రోడ్ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒక మరాఠీ వ్యాపారవేత్త అస్సాంకు వెళ్లి భాష నేర్చుకోవడానికి సమయం తీసుకుంటే, అతడిపై దాడి చేయాలా..? అని ప్రశ్నించారు. మరాఠీ గురించి గర్వపడితే దానిని అధ్యయనం చేయండి, నేర్పించండి, భాషను సెలబ్రేట్ చేసుకోందడి అని ఫడ్నవీస్ అన్నారు.
