Site icon NTV Telugu

Fact Check: అంత్యక్రియలపై 18 శాతం జీఎస్టీ నిజమేనా?

Gst On Funeral

Gst On Funeral

GST on Crematorium Services: కేంద్ర ప్రభుత్వం నూతనంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లను సవరించింది. ఈ నేపథ్యంలో శ్మశానవాటిక సేవలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలపై జీఎస్టీ విధిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది ముమ్మాటికీ తప్పు అని వెల్లడించింది. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక, మార్చురీ సేవలపై ఎలాంటి జీఎస్టీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ కేవలం పని ఒప్పందాలకు మాత్రమే వర్తిస్తుందని, సేవలకు కాదని తేల్చి చెప్పింది.

Read Also: Cake Delivery: రూ. 500కి చిల్లర తీసుకురమ్మంటే.. ఏకంగా కేక్‌పైనే..

అటు దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రీ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై 5 శాతం జీఎస్టీని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడంతో కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబశ్రీ, చిన్న దుకాణాలలో విక్రయించే వస్తువులపై ఎలాంటి జీఎస్టీ విధించబోమని ప్రకటించింది. కుటుంబశ్రీ , చిన్న దుకాణాలలో విక్రయించే 1, 2 కేజీల ప్యాకెట్ల వస్తువులపై, విడిగా అమ్మే వస్తువులపై ఎలాంటి పన్నును విధించమని కేరళ ఆర్ధిక మంత్రి బాలగోపాల్ వెల్లడించారు.

Exit mobile version