NTV Telugu Site icon

Anna Sebastian Perayil: పని ఒత్తిడితో మరణించిన అన్నా సెబాస్టియన్.. ఈ నెలలో వివాహం జరగాల్సి ఉంది..

Anna

Anna

Anna Sebastian Perayil: ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY) ఇండియా కంపెనీలో పనిచేసే 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్‌ మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ వర్క్ కల్చర్, పని ఒత్తిడి ఆమె మృతికి కారణమైనట్లు ఆమె తల్లి ఆరోపించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నా మరణం తర్వాత దేశవ్యాపంగా చాలా మంది ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని సోషల్ మీడియా వ్యాప్తంగా హైలెట్ చేశారు. కొందరు కార్పొరేట్ ఉద్యోగం అంటే చాలా కష్టమంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు కొన్ని కంపెనీల్లో తమపై సీనియర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారిని ఎదిరిస్తే పని ఒత్తిడితో వేధిస్తున్నారంటూ చెప్పారు. కేరళ కొచ్చికి చెందిన అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జూలై 20న మరణించారు. ఆఫీసులోనే తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స చెందుతూ మరణించారు.

Read Also: Ashok Galla: అశోక్ గల్లా హీరోగా రొమాంటిక్‌ కామెడీ డ్రామా.. క్లాప్ కొట్టిన నమ్రత

ఇదిలా ఉంటే, అన్నాకి ఈ నెలలో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. అన్నా తల్లి అనితా అగస్టిన్ EY ఇండియా ఛైర్మన్ రాజీవ్ మెమానీకి తన కుమార్తె పనిలో ఎదుర్కొన్న సవాళ్లపై ఒక లేఖ రాసిన తర్వాత, ఆయన సామరస్యపూర్వకమైన ఆఫీసుని రూపొందించే వరకు తాను విశ్రమించనని చెప్పారు.

అన్నాతో ఉన్న అనుబంధాన్ని ఆమె కజిన్ సునీల్ జార్జ్ కురువిల్లా పంచుకున్నారు. శుక్రవారం ఆయన లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్ట్ కన్నీళ్లు తెప్పించాయి. అన్నా శాశ్వతంగా వెళ్లిపోయింది, కానీ ఆమె గతంలో కన్నా మరింత శక్తివంతంగా మారిందని అన్నారు. అధికారుల బారి నుంచి యువ జీవితాలను ఆమె రక్షించవచ్చని అన్నారు. ఈ నెలలోనే ఆమెకు పెళ్లి నిశ్చయమైంది అని చెప్పారు. అన్నా మరణం తర్వాత ఉద్యోగుల పని గంటల్లో మార్పులు రావాలనే ప్రతీ ఒక్కరు వ్యాఖ్యానిస్తున్నారు. కేరళ ఎంపీ శశిథరూర్ ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని అన్నారు.