ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ట్రయల్ కోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 2 వరకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో వీరిని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Physical Harassment: ట్యూషన్ కోసం వచ్చిన బాలికపై కన్నేసిన టీచర్.. అత్యాచారం
లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది వాయిదా పడింది. ఇక మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. కవిత కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. త్వరలోనే విచారణకు రానుంది.
ఇది కూడా చదవండి: Pappachan murder: “నాకంటూ ఎవరూ లేరు” అని చెప్పడమే పాపమైంది.. సంచలనంగా కేరళ మర్డర్ కేసు..