Site icon NTV Telugu

Kejriwal: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ మరోసారి పొడిగింపు.. ఎప్పటివరకంటే..!

Kejriwal

Kejriwal

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి ట్రయల్ కోర్టు పొడిగించింది. ఆగస్టు 20 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గురువారం కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Samantha : నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఒంటరి వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలంటూ సమంత సంచలన పోస్ట్

లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం కోర్టు్లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఒకానొక సమయంలో మాత్రం ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ రూపంలో ఆశలు గల్లంతయ్యాయి. దర్యాప్తు సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి అడ్డుకోవడంతో కేజ్రీవాల్ విడుదల నిలిచిపోయింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం ఎన్నికల ప్రచారం కోసం 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే జైల్లో కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Naga Chaitanya: ఎంగేజ్మెంట్ కి ముందు సమంత ఫోటోలు డిలీట్ చేసిన నాగ చైతన్య?

Exit mobile version