Rameshwaram Cafe: బెంగళూర్ నగరంలో ప్రముఖ రెస్టారెంట్‌గా పేరొందిన రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని వైట్‌ఫీల్డ్ లోని రామేశ్వరం కేఫ్‌లో సంభవించిన పేలుడులో కనీసం నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురు సిబ్బంది ఉండగా..ఒకరు కస్టమర్. ప్రాథమిక నివేదిక ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బ్యాగులో ఉంచిన వస్తువు పేలినట్లుగా సమాచారం వస్తోంది. పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. పేలుడు వార్త తెలియగానే వైట్‌ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కేఫ్ బెంగళూర్‌లో పలు నగరాల్లో ప్రముఖ రెస్టారెంట్ జాయింట్‌గా పేరు తెచ్చుకుంది. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. pic.twitter.com/9Ay3zBq3vr
— ANI (@ANI) March 1, 2024
