Site icon NTV Telugu

Artificial Intelligence : ఏఐతో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు.. ఆది నుంచే నియంత్రించాలంటున్న మేధావులు

Ai

Ai

Artificial Intelligence : టెక్నాలజీ ప్రతి ఏడాది అభివృద్ది చెందుతూనే ఉంది. టెక్నాలజీ అనేది మానవ జీవితంలో నిత్యవసరంగా మారిపోయింది. అది ఫోన్‌ వాడకం కావచ్చు.. ల్యాప్‌టాప్‌ కావొచ్చు.. ఇతర టెక్నికల్ వస్తువులు కావొచ్చు. అయితే టెక్నాలజీతో నష్టాలు కూడా ఉంటాయన్న సంగతి మరచిపోవద్దని మేధావులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ ఒక ఊపు ఊపేస్తోంది. టెక్నాలజీ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ తో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు ఉండబోతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే ప్రమాదాల నేపథ్యంలో ఆదిలోనే ఏఐ వినియోగంపై నియంత్రణ సాధించకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు ఏదుర్కోవాల్సి వస్తుందని వివిధ రంగాల మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏఐతో భవిష్యత్‌లో ప్రమాదాలుంటాయని పేర్కొంటూ సెంటర్‌ ఫర్‌ ఏఐ సేఫ్టీ (సీఏఐఎస్‌) వెబ్‌సైట్‌లో దాదాపు 350 మంది వివిధ రంగాల నిపుణులు సంతకాలతో ఓ ప్రకటన చేశారు. ఏఐతో అంతరించిపోయే రంగాలను తగ్గించటంతోపాటు అంటువ్యాధులు, అణు యుద్ధాలు వంటి సామూహిక ప్రమాదాలను కూడా నివారించేందుకు చర్యలు చేపట్టాలని కొన్ని సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రకటనపై సంతకాలు చేసినవారిలో ప్రముఖ ఏఐ కంపెనీలు ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మ్యాన్‌, గూగుల్‌ డీప్‌మైండ్‌ సీఈవో డెమిస్‌ హస్సాబిస్‌, ఆంత్రోపిక్‌ సీఈవో డేరియో అమోడీ ఉన్నారు.
Traffic restrictions: సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు .. ఆ సమయాల్లో తస్మాత్ జాగ్రత్త

Exit mobile version