Site icon NTV Telugu

Exit Polls 2022: 3 రాష్ట్రాల్లో బీజేపీ, పంజాబ్‌లో ఆప్‌, గోవాలో హోరా హోరీ

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.. అయితే, ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? అధికారంలోకి వచ్చేది ఎవరు? ఓడేదెవరు? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారి కోసం.. కొన్ని సర్వే ఏజెన్సీలు, న్యూస్ చాలెన్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి.. వాటి ప్రకారం మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించనుండగా… ఒక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవిర్భవించబోతోంది ఆమ్‌ఆద్మీ పార్టీ, ఇక, గోవాలో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య హోరా హోరీ తప్పదని అంచనా వేశాయి ఎగ్జిట్‌ పోల్స్‌..

ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి ఎగ్జిట్‌ పోల్స్‌.. ఇక, ఢిల్లీ నుంచి పంజాబ్‌కు ఆప్‌ విస్తరించే అవకాశాలు ఉన్నాయి.. ఆమ్‌ ఆద్మీ అతిపెద్ద పార్టీగా పంజాబ్‌లో ఆవిర్భవించబోతోందని అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్‌ పోల్స్ ఇక, గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ సాగుబోతోంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 230కి పైగా స్థానాలు కైవసం చేసుకోబోతోంది. ఇక, 117 స్థానాలున్న పంజాబ్‌లో 65కు పైగా స్థానాలతో ఆమ్‌ఆద్మీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుంది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెబుతున్నాయి ఎగ్జిట్‌ పోల్స్.. 32-34 స్థానాలు బీజేపీకి రాబోతున్నయి. ఇక, 40 స్థానాలున్న గోవాలో హోరీ హోరీ తప్పేలా లేదు.. బీజేపీకి 13-17, కాంగ్రెస్‌కు 15-17 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి.. ఇక, టీఎంసీ 4-9 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు 60 స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ అవకాశం ఉంది. బీజేపీకి 23-27 వరకు కాంగ్రెస్‌ 12-16 స్థానాల వరకు విజయం సాధించే వరకు ఉందని చెబుతున్నాయి ఎగ్జిట్‌పోల్స్.

Exit mobile version