NTV Telugu Site icon

Kejriwal: లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీటు దాఖలు.. కేజ్రీవాల్‌కు సమన్లు

Cne

Cne

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏడవ అనుబంధ ఛార్జ్‌సీట్‌ను దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తాజా ఛార్జ్ షీట్‌లో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుని.. జూలై 12వ తేదీన హాజరుకావాలని కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: BJP: “బెంగాల్‌లో మరో తాలిబాన్ వీడియో”.. తృణమూల్ అరాచకాలపై రాహుల్ గాంధీ మౌనం ఎందుకు..?

మరోవైపు తనను సీబీఐ అరెస్ట్‌ చేయటం, మూడు రోజుల కస్టడీకి తీసుకోవటంపై కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఇక ఈ రెండు పిటిషన్లపై జూలై 17న విచారణ జరగనుంది.

ఇది కూడా చదవండి: Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌ సమస్యలపై ఫోకస్‌ పెట్టిన కేంద్రం.. రేపు విశాఖకు ఉక్కు మంత్రి..

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీ తర్వాత తీహార్ జైలుకు తరలించారు. ఇక లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. ఇక ఇటీవల ట్రయిల్ కోర్టు కేజ్రీవాల్‌ను రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. కానీ అంతలోనే ఆవిరైపోయింది. ఈడీ హైకోర్టుకు వెళ్లి అడ్డుకోవడంతో ఆప్ తీవ్ర నిరాశకు గురైంది.

ఇది కూడా చదవండి: Boeing plane: గాల్లో ఉండగా ఊడిన విమానం టైర్.. తప్పిన ముప్పు