Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపింది నిజమే: మాజీ ఉగ్రవాది..
- ఉగ్రవాదుల వద్ద కండోమ్, ప్రేమ లేఖలు..
- పాక్ ఉగ్రవాదుల లక్ష్యాలు వేరేగా ఉండేవి..
- ధురంధర్ సినిమాలో చూపింది నిజమే..
- మాజీ ఉగ్రవాది ముస్తాక్ అహ్మద్ భట్ సంచలన నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-Terrorist: పాకిస్తాన్, ఉగ్రవాదం గురించి మాజీ కాశ్మీరీ ఉగ్రవాది, భారత సైన్యానికి అండర్ కవర్ ఆపరేటివ్‌గా పనిచేసిన ముస్తాక్ అహ్మద్ భట్ సంచలన విషయాలు వెల్లడించారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి వచ్చిన విదేశీ ఉగ్రవాదులు తమను తాము ‘‘ముజాహిదిన్లు’’గా చెప్పుకున్నప్పటికీ వారి అసలు లక్ష్యాలు వేరేగా ఉండేవని వెల్లడించారు. ఎన్కౌంటర్లలో హతమైన ఉగ్రవాదుల వద్ద నుంచి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలలో రాసిన ప్రేమ లేఖలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఆ లేఖల్లో మత పరమైన పోరాటం కన్నా, కాశ్మీరీ అమ్మాయిలను వలలో ఎలా వేయాలనే ప్రయత్నాలు కనిపించినట్లు చెప్పాడు. తప్పుడు ప్రేమ, భావోద్వేగాలతో కొందరు యువతులను వలలో వేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించాడు.
ఇదే కాకుండా పలు ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులు మరణించిన తర్వాత వారి వద్ద కండోమ్ వంటి వస్తువులు లభించాయని ముస్తాక్ వెల్లడించారు. వాటి గురించి ప్రశ్నించినప్పుడు చాలా మంది ఉగ్రవాదుల సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పాడు. దక్షిణ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్థానిక ఇళ్లలో ఆశ్రయం పొందుతూ, అక్కడి యువతులతో రిలేషన్ పెట్టుకున్నారని కూడా చెప్పాడు. ఈ పరిణామాలు ఇప్పటికీ ఆ కుటుంబాలపై ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడించారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదం వల్ల కాశ్మీర్లో అనేక కుటుంబాలు నష్టపోయాయని, స్థానిక యువత తప్పుదారిలో నడిచే పరిస్థితులు ఏర్పడ్డాయని ముస్తాక్ అహ్మద్ భట్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం వల్ల అత్యధికంగా నష్టపోయేది సాధారణ ప్రజలేనని ఆయన అన్నారు. ఇదే కాకుండా దురంధర్ సినిమాలో పాకిస్తాన్లో భారత కరెన్సీని ముద్రించినట్లు చూపించడం నిజమే అని చెప్పాడు. దక్షిణ కాశ్మీర్లో ఆ కరెన్సీ నోట్లతో సగం తానే పంపిణీ చేసినట్లు ఒప్పుకున్నాడు.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?