Site icon NTV Telugu

PM Modi: మోడీ ధరించిన “వాచ్‌”పైనే అందరి చూపు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా..

Modi Watch

Modi Watch

PM Modi: భారతీయ కళలు, సంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకత. దీంతో పాటు మేకిన్ ఇండియా ఉత్పత్తుల్ని కూడా ప్రమోట్ చేస్తుంటారు. భారతీయులు, దేశంలోనే తయారయ్యే వస్తువుల్ని కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు మోడీ ధరించిన ‘‘వాచ్’’పై అందరి దృష్టి నెలకొంది. జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ప్రత్యేకమైన లగ్జరీ వాచ్ మోడీ చేతికి కనిపించింది. దీని పేరు ‘‘రోమన్ బాఘ్’’. ఈ వాచ్‌లో 1947లో విడుదలైన ఒక రూపాయి నాణెం ఉండటం దీని అసలు ప్రత్యేకత. ఈ డిజైన్ పూర్తిగా భారత వారసత్వం, మేక్ ఇన్ ఇండియా భావనను చూపిస్తుంది.

Read Also: Kayadu Lohar : ఆ వార్తలు చూసి ఏడ్చేశా.. కయాదు లోహర్ కామెంట్స్

43 మి.మీ ఉంటే ఈ 316L స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ వాచ్, జపనీస్ మియోటా మిషన్‌పై నడుస్తుంది. ఇది అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని సూచిస్తుంది. వాటర్ రిసిస్టెన్స్ కలిగిన గడియారం ముందు వెనక సఫైర్ క్రిస్టర్ గ్లాస్ ఉంటుంది. ఇది వాచ్‌కు రిచ్ లుక్, చాలా అందాన్ని ఇస్తుంది. దీని ధర రూ. 55,000- రూ. 60,000 మధ్య ఉంటుందని అంచనా. జైపూర్ వాచ్ కంపెనీ వ్యవస్థాపకులు గౌరవ్ మెహతా. ఈ కంపెనీ భారతీయ పాత నాణేలు, స్టాంపులు, సంప్రదాయ డిజైన్లను ఉపయోగించి ప్రత్యేకమైన లగ్జరీ వాచ్‌లను తయారు చేస్తుంది.

Exit mobile version