NTV Telugu Site icon

Men Thrash Father: పిల్లాడు ఏడుస్తున్నా కనికరించ లేదు.. కర్రలతో దారుణంగా కొట్టారు

Men Thrash Father

Men Thrash Father

Men Thrash Father: తన కొడుకును స్కూల్‌లో దింపడానికి వెళ్లిన తండ్రి దుండుగులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. చిన్న పిల్లాడు దీనిని చూసి గుక్కపెట్టి ఏడుస్తున్నా.. వాళ్లల్లో కనికరం లేకుండా పిల్లాడి తండ్రిపై దుండుగులు దాడి చేశారు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన పంజాబ్‌లోని మాన్సాలో జరిగింది. పంజాబ్‌లోని మాన్సాలోని కిడ్ స్కూల్ వైపు ద్విచక్ర వాహనంపై తండ్రీ కొడుకులు వెళుతుండగా, పట్టపగలు కొందరు దుండగులు పిల్లాడి తండ్రిపై దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. కొంతమంది అప్పటికే సంఘటన స్థలంలో వేచి ఉండగా.. మరికొందరు వ్యక్తి బైక్‌ను అనుసరిస్తూ వచ్చారు. ఈ సంఘటనను సీసీటీవీలో రికార్డు అయింది.

Read also: Medicine: మందులు కావాలి బాబోయ్ అంటున్న పాకిస్తాన్.. పెద్ద మనసు చేసుకున్న భారత్

ఉదయం బాధితుడు తన పిల్లాడ్ని స్కూల్‌ వద్ద దింపడానికి బైక్‌పై వచ్చాడు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడ దించి లోపలికి పంపుతున్న దృశ్యాలు విజువల్స్‌లో కనిపించడంతో ఈ సంఘటన విద్యాసంస్థ ముందు జరిగినట్టు తెలుస్తోంది. తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని తన కుమారుడిని దింపడానికి తన వాహనాన్ని ఆపాడు. పాఠశాల వద్ద తన వాహనాన్ని అలా ఆపాడో లేదో.. అప్పటికే వెంబడించిన కొంతమంది యువకులు అతనిపై కర్రలతో దాడి చేశారు. బాధితుడు తిరుగుబాటు చేయకుండా అతన్ని ఓ వ్యక్తి గట్టిగా పట్టకున్నాడు. దీంతో ఇతరులు అతనిపై దాడి చేశారు. పక్కనే ఉన్న బాధితుని కొడుకు నిందితులు పాశవికంగా కొట్టారు. నిందితులు దాడి చేస్తున్నా పక్కనే ఉన్న అందరూ చూస్తున్నారు తప్పా.. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. నిందితులు వెళ్లిపోయాక ఓ మహిళ.. బాధితున్ని లేపి ఆస్పత్రికి తరలించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులపై ఐపీసీ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు. ఇరువర్గాల మధ్య వ్యక్తిగత వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.